గుర్రం జాషువా జయంతి

గుర్రం జాషువా జయంతి కళ్యాణదుర్గంలోని ఎస్ వి జి ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయరాం రెడ్డి గారి అధ్యక్షతన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి జరిగింది. ప్రిన్సిపల్ గారు సభను ఉద్దేశించి ఉపన్యసిస్తూ తెలుగు సాహిత్య రంగంలో తొలి తరం కవులలో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి గుర్రం జాషువా.వారిది రాపిడి పడ్డ జీవితం, ఆ రాపిడిలో రాణించిన ప్రతిభ ఆ ప్రతిభలో గుబాలించిన కవిత, కులమత విద్వేషం బుల్ తలచూపుని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది గుర్రం జాషువా అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి. శేషయ్య గారు మాట్లాడుతూ గుర్రం జాషువా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యాడని ఈయన కవి కావటానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందాలని తెలిపారు. తెలుగు విభాగం అధ్యాపకులు ఎం.పరమేష్ ఉపన్యసిస్తూ గుర్రం జాషువా జగమెరిగిన విశ్వ నరుడు. తెలుగు సాహితీ ప్రపంచంలో మహా దార్శనికుడు తన సాహిత...