గుర్రం జాషువా జయంతి
గుర్రం జాషువా జయంతి
ప్రిన్సిపల్ గారు సభను ఉద్దేశించి ఉపన్యసిస్తూ తెలుగు సాహిత్య రంగంలో తొలి తరం కవులలో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి గుర్రం జాషువా.వారిది రాపిడి పడ్డ జీవితం, ఆ రాపిడిలో రాణించిన ప్రతిభ ఆ ప్రతిభలో గుబాలించిన కవిత, కులమత విద్వేషం బుల్ తలచూపుని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది గుర్రం జాషువా అని తెలిపారు.
కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి. శేషయ్య గారు మాట్లాడుతూ గుర్రం జాషువా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యాడని ఈయన కవి కావటానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందాలని తెలిపారు.
తెలుగు విభాగం అధ్యాపకులు ఎం.పరమేష్ ఉపన్యసిస్తూ గుర్రం జాషువా జగమెరిగిన విశ్వ నరుడు. తెలుగు సాహితీ ప్రపంచంలో మహా దార్శనికుడు తన సాహిత్యం ద్వారా సమాజాన్ని సంస్కరించిన మానవతావాది. విశాల దృక్పథంతో రచనలు చేసిన జాషువా తన సాహిత్యం ద్వారా సమాజాన్ని మేల్కొల్పారు. అలాగే గుర్రం జాషువా తన జీవితంలో అనుభవించిన అనేక కష్టనష్టాలను సాహిత్యం ద్వారా ప్రకటించాడు. ఈయన ఎన్ని అవమానాలను పొందాడో తన సాహిత్యంలో తెలియజేశాడు. జాషువా రచనల్లో అభ్యుదయం, మానవతావాదం, సంఘసంస్కరణ, సత్యాన్వేషణ కనిపిస్తాయి. కాళిదాసు, మేఘ సందేశం ఎంతటి ప్రశస్తి పొందిందో తెలుగు సాహిత్యంలో గబ్బిలం కావ్యం కూడా అంతే కీర్తిని సంపాదించింది. మన సాహిత్యంలో హంసలు రామచిలకలు, రాయబారాలుగా చూసాం కానీ ఈ కావ్యంలో జాషువా గబ్బిలాన్ని దూతగా తీసుకొని తన సందేశాన్ని దేశమంతటా ప్రచారం చేశారు. ఈయన రచించిన మరో కావ్యం పిరదౌసి పారశీక కవి అయిన పిరదౌసిని గజిని మహమ్మద్ ఆహ్వానించి తన వంశ చరిత్రను రాసి తనకు అంకితం చేయమని కోరాడు. ఈ కావ్యం లో జాషువా చూపిన శిల్ప నైపుణ్యం మరియు పద్యాన్ని నడిపించడంలో పద ప్రయోగంలో ప్రాచీన కవులు శైలి స్పష్టంగా కనిపిస్తుంది. గుర్రం జాషువాకు కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి మొదలైన బిరుదులు కూడా పొందాడు. అంతేకాకుండా కళా ప్రపూర్ణ పద్మభూషణులచే సత్కరింపబడ్డాడు. క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది అని తెలియజేశారు.
మరో తెలుగు అధ్యాపకుడు డాక్టర్ వై అంజన్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇచ్చోటనే అనే పద్యాన్ని పాడి విద్యార్థులను మనోహర ముగ్ధులను చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంప్యూటర్ అధ్యాపకుడు సుధాకర్ విద్యార్థిని విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు వీడియోల ద్వారా ఎల్సిడి స్క్రీన్ మీద చాలా అంశాలను చూపించి స్వాతంత్ర పోరాటంలో గాని, సామాజిక అంశాలలో కానీ గుర్రం జాషువా గారు సమాజాన్ని ఉత్తేజపరిచిన వయనాన్ని వివరించారు.
ప్రథమ సంవత్సరం బిఎస్సి కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని కుమారి ఆశ వందన సమర్పణ చేస్తూ కళాశాల అధ్యక్షులు వారికి, అధ్యాపకులు, ఆధ్యాపకేతులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను, పత్రికలలో ప్రచురణ అయినది జతపరచడమైనది
Comments
Post a Comment