సంగీతావధానం (Sangeeta Avadhanam)

సంగీతావధానం స్థానిక కళ్యాణదుర్గంలోని శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 29-11-2022 సంవత్సరమున తెలుగు విభాగం మరియు తెలుగు భాషా వికాసం ఉద్యమం ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జయరామరెడ్డి గారి అధ్యక్షతన సంగీతావా దానం కార్యక్రమం కనుల పండుగ జరిగింది. ఈ సాహితీ సభకు అవధానిగా ముఖ్య అతిథిగా కడప జిల్లా నుండి కవి గాయకుడు గౌరవనీయులు యలమర్తి మధుసూధన గారు హాజరయ్యారు. ముందుగా తెలుగు విభాగాధిపతి గౌరవనీయులు శ్రీ ఎం పరమేష్ గారు ప్రిన్సిపల్ డాక్టర్ జయరామిరెడ్డి గారిని అలాగే అవధాని యలమర్తి మధుసూదన్ గారిని మరియు కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారిని అలాగే జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు జి యల్ యన్ ప్రసాద్ గారిని తెలుగు భాషా వికాసం అధ్యక్షులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక పైకి ఆహ్వానించారు. ఆ తర్వాత అవధాని గారిచే జ్యోతి ప్రజ్వలన పూర్తి అయిన తర్వాత విద్యార్థులచే మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని ఆలపించారు. ఈ సాహితీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ మన సంస్కృతి సంప...