సంగీతావధానం (Sangeeta Avadhanam)

సంగీతావధానం

స్థానిక కళ్యాణదుర్గంలోని శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 29-11-2022 సంవత్సరమున తెలుగు విభాగం మరియు తెలుగు భాషా వికాసం ఉద్యమం ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జయరామరెడ్డి గారి అధ్యక్షతన సంగీతావా దానం కార్యక్రమం కనుల పండుగ జరిగింది.   ఈ సాహితీ సభకు అవధానిగా ముఖ్య అతిథిగా కడప జిల్లా నుండి కవి గాయకుడు గౌరవనీయులు యలమర్తి మధుసూధన గారు హాజరయ్యారు.  ముందుగా తెలుగు విభాగాధిపతి గౌరవనీయులు శ్రీ ఎం పరమేష్ గారు ప్రిన్సిపల్ డాక్టర్ జయరామిరెడ్డి గారిని అలాగే అవధాని యలమర్తి మధుసూదన్ గారిని మరియు కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారిని అలాగే జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు జి యల్ యన్ ప్రసాద్ గారిని తెలుగు భాషా వికాసం అధ్యక్షులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక పైకి ఆహ్వానించారు.   ఆ తర్వాత అవధాని గారిచే జ్యోతి ప్రజ్వలన పూర్తి అయిన తర్వాత విద్యార్థులచే మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని ఆలపించారు.  

ఈ సాహితీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను మరువకూడదని తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మన కళాశాలలో అష్టావధానము,   సంగీతావధానం వంటి సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.   అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాని గారు ఉపనిశిస్తూ సంగీత అవధానం ఒక వినూత్న ప్రక్రియ అని దీనివలన విద్యార్థులలో సాహిత్యంతో పాటు సంగీతంపై అవగాహన పెంపొందించుకోవడం వల్ల వారిలో మానసిక వికాసము, ఆనందం కలుగుతుందని తెలిపారు.  అలాగే తెలుగు విభాగాధిపతి  శ్రీ ఎం పరమేష్ గారు మాట్లాడుతూ కళలు మానవ సంస్కృతికి ప్రతిబింబాలని,  సంగీతం ఒక శ్రావ్య కళ అని...అంటే విని ఆనందించేదని అంతేకాకుండా సంగీతాన్ని విని శిశువులు పశువులు పాములు కూడా పరవశిస్తాయని అందుకే సంగీతానికి అంత గొప్పతనం ఉందని తెలియజేశారు. 

ముందుగా ఈ కార్యక్రమంలో పృక్షకులుగా మొదటి అంశము ఇష్ట దేవతా స్తుతి ఎం పరమేష్ గారు ప్రారంభిస్తూ బమ్మెర పోతన రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతంలోని పద్యాన్ని అవధాని గారికి ఇచ్చి కళ్యాణి రాగంలో పాడమని తెలియజేశారు.   అలాగే రెండవ అంశం తెలుగు అధ్యాపకులు డాక్టర్ వై అంజన్ రెడ్డి గారు తాళ్లపాక అన్నమయ్య కీర్తనను తనకు నచ్చిన తాళంలో పాడమని అవధాని గారికి ఇవ్వడం జరిగింది.  అలాగే మూడవ అంశం రామదాసు కీర్తనను జంతు శాస్త్ర అధ్యాపకులు శ్రీ జీ ఎల్ ఎన్ ప్రసాద్ గారు జానపద గేయంలో పాడమని అవధాని గారికి ఇవ్వడం జరిగింది.   అలాగే నాలుగో అంశం సినిమా పాటను కళాశాల విద్యార్థి చిరంజీవి అజయ్ కుమార్ సరికొత్త బాణీలు పాడమని అవధాని గారికి ఇవ్వడం జరిగింది. ఇక ఐదో అంశం బుర్రకథ అర్థశాస్త్ర ఉపన్యాసకులు శేషయ్య గారు ఒక పద్యాన్ని ఇచ్చి బుర్రకథ బాణీలు పాడమని తెలియజేశారు.  ఆరో అంశం హరికథను కళాశాల విద్యార్థిని కుమారి  సౌమ్య  శార్దూలం పద్యం ఇచ్చి హరికథ బాణీలు పాడమని తెలిపారు.   7వ అంశం వీధి భాగవతం కంప్యూటర్ అధ్యాపకులు శ్రీ ఎం సుధాకర్ గారు సుమతీ శతక పద్యాన్ని ఇచ్చి వీధి భాగవతంలో పాడమని అడిగారు.  అలాగే చివరి అంశం యక్షగానం హిందీ అధ్యాపకులు అఖిల గారు మహాభాగవతంలోని ఒక సీస పద్యాన్ని ఇచ్చి యక్షగానంలో పాడమని తెలిపారు.   ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు అవధాని గారు చక్కగా రాగయుక్తంగా మరియు భావ యుక్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా పాడుతూ విద్యార్థులలో చైతన్యాన్ని కలిగిస్తూ అవధానం చేశారు.   అవధాని గారికి కళాశాల అధ్యక్షులు మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వై ఆంజనేయ రెడ్డి గారు వందన సమర్పణ చేశారు.  ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.

తెలుగు విభాగము ఇలాంటి విన్నూత్న కార్యక్రమాల నిర్వహణను చూసి అధ్యాపకులు, విద్యర్థినీ విద్యార్థులు సంబ్రమాచర్యములు వ్యక్త పరచినారు.   పై అంశాలు అన్నిటిని పత్రికా, టి.వి. విలేకరులు సమాజానికి తెలియ పరచినారు.   































Comments

Popular posts from this blog

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

అష్టావధానము

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు