Posts

Showing posts from August, 2022

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

Image
   నేడు అనగా 29 ఆగస్టు 2022 న స్థానిక ఎస్విజియం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు తెలుగు విభాగంలో ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన గిడుగు రామమూర్తి జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారు ఉపన్యసిస్తూ పిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషకు చేసిన సేవ అమోఘమని వాడుక భాష తెలుగుకు వేడుక కావాలని మన భాషను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని అంతేకాకుండా మాతృభాషను ప్రేమించలేనివాడు మాతృదేశాన్ని కూడా ప్రేమించలేడని భాష వలనే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు భావితరాలకు అందుతాయని అలాగే కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మరువకూడదని తెలియజేశారు.     ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు ఎం పరమేష్,   డాక్టర్ వై అంజినరెడ్డి పాల్గొని వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

డిగ్రీ తర్వాత తెలుగులో చేయ దగిన కోర్సులు

 ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా,  మీరు అందరూ డిగ్రీ తృతీయ సంవత్సరం ముగించుకొని ఇప్పుడు ఇప్పుడే పోటీ ప్రపంచంలోకి అడుగు  పెడుతున్నారు.  గతంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం అనగానే మనమందరం ఉన్నత విద్యగా భావించే వాళ్ళము.  కానీ మారుతున్న కాల పరిస్థితులను బట్టి డిగ్రీ తర్వాత పీజీ విద్యను అభ్యసించడం చాలా ముఖ్యము మరియు పిజి విద్యను అభ్యసించడం వలన మీకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించును.  దానితోపాటు పీజీ విద్యను అభ్యసించే సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి ఎక్కువ సమయం ఉండును.  దృష్టిలో ఉంచుకొని మీరు ఎంఏ తెలుగు, టి పి టి తెలుగు వంటి కోర్సులను చేసి తెలుగు భాష ద్వారా కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చ.