తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)
నేడు అనగా 29 ఆగస్టు 2022 న స్థానిక ఎస్విజియం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు తెలుగు విభాగంలో ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన గిడుగు రామమూర్తి జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారు ఉపన్యసిస్తూ పిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషకు చేసిన సేవ అమోఘమని వాడుక భాష తెలుగుకు వేడుక కావాలని మన భాషను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని అంతేకాకుండా మాతృభాషను ప్రేమించలేనివాడు మాతృదేశాన్ని కూడా ప్రేమించలేడని భాష వలనే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు భావితరాలకు అందుతాయని అలాగే కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మరువకూడదని తెలియజేశారు.
Comments
Post a Comment