గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గము నందు సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ వెంకట అప్పారావు గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Dr. వెంకట శేషయ్య గారు అధ్యక్షత వహించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ధ్రువ తారగా ప్రకాశించిన నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు. ఈయన దేశభక్తుడిగా భావకవిగా, సంఘసంస్కర్తగా, నాటక కర్తగా, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడులను సృష్టించి తెలుగు జాతిని జాగృతం చేశారు. అలాగే వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు బాట వేసినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఈయన ముత్యాల సరాలు అనే కొత్త చందస్సులో కొత్త కథా వస్తువులు, సాంఘిక అంశాలు తీసుకొని తెలుగు భాషకు ప్రాముఖ్యమిస్తూ, సహజ వర్ణనలతో రాయబడిన కవితలు అనేకం ఉన్నాయి. అలాగే దిద్దుబాటు కథానిక లో వైవాహిక జీవిత సమస్యను, మీ పేరేమిటి కథ లో మతం పేరుతో జరిగే మోసాల్ని కళ్ళకు కట్టినట్లు తెలిపారు. దేశభక్తి కవిత్వం...