అష్టావధానము

తెలుగు విభాగం ఆధ్వర్యంలో
అష్టావధానము
 

కళ్యాణదుర్గంలోని స్థానిక శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14-9-2022 సంవత్సరమున తెలుగు భాషావికాసం మరియు తెలుగువిభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి .జయరామరెడ్డి గారి అధ్యక్షతన అష్టావధాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.   ముందుగా తెలుగు అధ్యాపకులు శ్రీ ఎం పరమేష్ గారు, కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి . జయరామ రెడ్డి గారిని అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాన బాలభాస్కర బిరుదు పొందిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థి చిరంజీవి శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారిని మరియు జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు శ్రీ జి . ఎల్.ఎన్ ప్రసాద్ గారిని అలాగే తెలుగు భాషా వికాసం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.   అష్టావధానములో పాల్గొంటున్న ఎనిమిది మంది పృచ్చకులను కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది.   ఆ తర్వాత ముఖ్య అతిథి, కళాశాల అధ్యక్షులచే జ్యోతి ప్రజ్వలన గావించి ప్రార్థన గేయం ప్రథమ సంవత్సరం కావేరి, ఆశ విద్యార్థులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని చక్కగా ఆలపించారు.

  కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యక్షులు డాక్టర్ టి జయ రామ రెడ్డి గారు ఉపన్యసిస్తూ అష్టావధానంతో తెలుగు వికసిస్తుందని,  ఇలాంటి సాహితీ కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థులలో చైతన్యం కలుగుతుందని, అంతేకాకుండా తెలుగు భాష పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని, తెలుగు భాష పై మక్కువ,  విద్యార్థులలో భాషపై పట్టు,  నేర్చుకోవాలనే తపన పెరుగుతాయని తెలిపారు. అష్టావధానంలో పృచ్చకులలో మన కళాశాలకు చెందిన తెలుగు అధ్యాపకులు శ్రీ ఎం పరమేష్ గారు వర్ణన అంశంతో,  డాక్టర్ వై అంజన రెడ్డి గారు న్యస్తాక్షరి అంశంతో పాల్గొనడం కళాశాలకు ప్రత్యేకత సంతరించుకుంది.   అంతేకాకుండా ఈ కళాశాల విద్యార్థులు చిరంజీవి పి టి ఈశ్వర్, బిఎ తృతీయ సంవత్సరం చిత్రానికి పద్యం అన్న అంశంతో,  కుమారి కే. సుజాత బిఎ తృతీయ సంవత్సరం విద్యార్థిని దత్తపది అన్న అంశంతో పాల్గొని  అవధాని గారికి ప్రశ్నల వర్షం కురిపించి పాఠకుల హృదయాలను ఆకర్షించడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు.
అష్టావధానం ప్రారంభమైన వెంటనే మహాభారతం, రామాయణం, భాగవతం, తెలుగు భాష యొక్క వైభవం మరియు ఈనాటి సామాజిక అంశాలకు సంబంధించిన అంశాలను,  ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు అవధాని గారు అనర్గళంగా, ఉత్సాహభరితంగా ఏమాత్రం తడబడకుండా తన ప్రతిభా పాటవాలతో మృదు మధురమైన కంఠంతో పద్యాలను రాగాలాపన చేస్తూ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని అందరి మన్నలను పొందడం జరిగింది. ఈ అష్టావధాన కార్యక్రమం ముగిసిన తర్వాత అవధాని గారిని కళాశాల అధ్యక్షులు మరియు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది.  

Enclosed Photo Evidences : 
















Comments

Popular posts from this blog

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు