గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

        SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గము నందు సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ వెంకట అప్పారావు గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Dr. వెంకట శేషయ్య గారు అధ్యక్షత వహించారు.

          ఆధునిక తెలుగు సాహిత్యంలో ధ్రువ తారగా ప్రకాశించిన నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు.  ఈయన దేశభక్తుడిగా భావకవిగా, సంఘసంస్కర్తగా,  నాటక కర్తగా, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడులను సృష్టించి తెలుగు జాతిని జాగృతం చేశారు.  అలాగే వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు బాట వేసినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఈయన ముత్యాల సరాలు అనే కొత్త చందస్సులో కొత్త కథా వస్తువులు, సాంఘిక అంశాలు తీసుకొని తెలుగు భాషకు ప్రాముఖ్యమిస్తూ, సహజ వర్ణనలతో రాయబడిన కవితలు అనేకం ఉన్నాయి.  అలాగే దిద్దుబాటు కథానిక లో వైవాహిక జీవిత సమస్యను, మీ పేరేమిటి కథ లో మతం పేరుతో జరిగే మోసాల్ని కళ్ళకు కట్టినట్లు తెలిపారు.  దేశభక్తి కవిత్వంలో సామాజిక కర్తవ్యాన్ని తెలుపుతూ దేశభక్తికి కొత్త నిర్వచనం చెప్పారు.  ఈ గేయంలో గురజాడలో సామాజిక చైతన్యం, సంఘసంస్కరణ, వర్తమాన భవిష్యత్తుల్ని దర్శించే తీరు ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.  ఈయన రచించిన కన్యాశుల్కం ఏడు అంకాలు కలదు. ఈ నాటకాన్ని ఆనంద గజపతికి అంకితం చేశాడు.  విపరీతమైన సాంఘిక దురాచారాలు అనేక విధాలుగా విహరించుచున్న కాలంలో కన్యాశుల్కం వెలువడినది.  ఇప్పటికీ నాటకం నిత్య నూతనంగా ఉన్నది.  నాటకములోని పాత్రలు నేటికీ సజీవంగా కనిపిస్తాయి.  ముఖ్యంగా గురజాడ కవిత్వంలో మానవతావాదం, సంఘసంస్కరణ దృష్టి, తెలుగుదనం, విశ్వ మానవ ప్రేమ,  దేశభక్తి పుష్కలంగా కనిపిస్తాయి.  కావున ఆధునిక తెలుగు కవిత్వానికి దిక్సూచి మన గురజాడ అప్పారావు.

        తెలుగు విశిష్టత రోజురోజుకు ప్రాధాన్యత సంతరించుకుందని సంతరించుకుందని న్యూస్ చానల్సుకు యూట్యూబ్ ఛానల్స్ కు పత్రికలకు మ్యాగజైన్లకు కాంటెంట్ రైటర్స్ గా విషయం పైన ఉన్నవారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నాయని కంప్యూటర్ అధ్యాపకుడు సుధాకర్ తెలియజేశారు. 

     కార్యక్రమం చివరిలో తెలుగు నందు ఉత్తమ మార్కులు 95 పైగా సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గురజాడ ఫౌండేషన్ వారి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది.  జాతీయగీతంతో  వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు.





Comments

  1. మిత్రమా, మీ తెలుగు బ్లాగు బహు బాగు. ఇది మీరు నిర్వహిస్తున్న తీరు కళాశాలకే మకుటాయమానముగా అలరారుచున్నది.

    ReplyDelete
    Replies
    1. సర్ ఇదంతా మీ శిక్షణ మీ ఆశీర్వాదం...

      Delete

Post a Comment

Popular posts from this blog

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

అష్టావధానము