Posts

Showing posts from February, 2023

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Image
  అంతర్జాతీయ మాతృభాషా  దినోత్సవం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ఫిబ్రవరి 21, 2023 న తెలుగు విభాగము ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అధ్యక్షతన, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని విద్యార్థులు ఆలపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి శేషయ్య గారు మాట్లాడుతూ మాతృభాషా అమృతం వంటిదని మనం పుట్టిన నాటి నుండే ఉగ్గుపాలతో పాటు, కన్నతల్లి మాతృభాషాను రంగరించి పోస్తుంది.  అందువల్లనే మాతృ భాషను తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు నేర్చుకుంటూనే ఉంటామని తెలిపారు. అంతేకాకుండా వెయ్యి సంవత్సరాలుగా తెలుగు జాతి, వెయ్యి విధాలుగా పండించుకున్న సజీవ భాష తెలుగు భాషని తెలియజేశారు.  అలాగే తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించిన ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన ఘనత అమ్మ భాషని తెలిపారు. అలాగే తెలుగు అధ్యాపకులు ఎం. పరమేష్ మాట్లాడుతూ కన్నతల్లి ,పుట్టిన గడ్డ ,స్వర్గం కంటే గొప్పవని వీటితో పాటు మాతృభాషా అయిన తెలుగు మహోన్నతమైనదని తెలుపుతూ, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మా...

వేమన జయంతి

Image
Date: 19th January 2023. Kalyanadurgam. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి గారి అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో నేడు వేమన జయంతి ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ వేమన ప్రజాకవి ,తిరుగుబాటుకవి ,లోక కవి అని కూడా ప్రసిద్ధి చెందాడు.ప్రజల భాషలో' ప్రజల కోసం వేదాంతం చెప్పి ఆ తర్వాత సంఘసంస్కర్తలకు మార్గదర్శకుడు అయ్యాడు. అంతేకాకుండా తెలుగు కవిత్వాన్ని జానపదుల నాలుకలపై నాట్యం చేసిన మహనీయుడు యోగివేమన అని తెలియజేశారు .అలాగే నేడు వేమన పద్యాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఆటవెలది చందస్సు లో పద్యాలు రాసాడని తెలిపారు. పద్య పఠన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ బహుమతులు ప్రధానం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి శేషయ్య గారు ,జంతు శాస్త్రl అధ్యాపకులు జి. ఎల్ .ఎన్ ప్రసాద్ గారు మరియు తెలుగు శాఖ అధ్యక్షులు ఎం. పరమేష్ ,తెలుగు అధ్యాపకులు వై. అంజన రెడ్డి మరియు కంప్యూటర్ అధ్యాపకులు ఎం. సుధాకర్ మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేశా...