అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 21, 2023 న తెలుగు విభాగము ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అధ్యక్షతన, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని విద్యార్థులు ఆలపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి శేషయ్య గారు మాట్లాడుతూ మాతృభాషా అమృతం వంటిదని మనం పుట్టిన నాటి నుండే ఉగ్గుపాలతో పాటు, కన్నతల్లి మాతృభాషాను రంగరించి పోస్తుంది. అందువల్లనే మాతృ భాషను తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు నేర్చుకుంటూనే ఉంటామని తెలిపారు. అంతేకాకుండా వెయ్యి సంవత్సరాలుగా తెలుగు జాతి, వెయ్యి విధాలుగా పండించుకున్న సజీవ భాష తెలుగు భాషని తెలియజేశారు. అలాగే తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించిన ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన ఘనత అమ్మ భాషని తెలిపారు. అలాగే తెలుగు అధ్యాపకులు ఎం. పరమేష్ మాట్లాడుతూ కన్నతల్లి ,పుట్టిన గడ్డ ,స్వర్గం కంటే గొప్పవని వీటితో పాటు మాతృభాషా అయిన తెలుగు మహోన్నతమైనదని తెలుపుతూ, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషాలో బోధన అలాంటిది తెలిపారు. అంతేకాకుండా దేశభాషలందు తెలుగు లెస్స అని పూర్వకవులు పొగిడిన భాష ఈనాడు ప్రపంచీకరణ ముసుగులో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. అలాగే విదేశీ సంస్కృతి విచ్చలవిడిగా మనపై దాడి చేస్తూ మన సంస్కృతిని అపహాస్యం చేస్తున్నదని తెలియజేశారు. అలాగే తెలుగు అధ్యాపకులు వై .అంజన రెడ్డి ఉపన్యసిస్తూ తెలుగు భాష ఎంతో గొప్పదని, మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమని అలాంటి భాషను, విద్యార్థులు, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన మరువకూడదని అంతేకాకుండా తెలుగు భాషాభివృద్ధికి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని తెలియజేశారు.
అలాగే కంప్యూటర్ అధ్యాపకులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మాతృభాషాను మరువకూడదని అలాగే పరాయి భాషలను గౌరవించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు ఎం. పరమేష్, వై అంజిన రెడ్డి, కంప్యూటర్ అధ్యాపకులు ఎం.సుధాకర్ పాల్గొన్నారు. అలాగే విద్యార్థిని ,విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని గురించి పాటలు ,ఉపన్యాసాలతో సభను విజయవంతం చేశారు.
Enclosures : Photos and Media covered Pics.
Comments
Post a Comment