వేమన జయంతి




Date: 19th January 2023.
Kalyanadurgam.

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి గారి అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో నేడు వేమన జయంతి ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ వేమన ప్రజాకవి ,తిరుగుబాటుకవి ,లోక కవి అని కూడా ప్రసిద్ధి చెందాడు.ప్రజల భాషలో' ప్రజల కోసం వేదాంతం చెప్పి ఆ తర్వాత సంఘసంస్కర్తలకు మార్గదర్శకుడు అయ్యాడు. అంతేకాకుండా తెలుగు కవిత్వాన్ని జానపదుల నాలుకలపై నాట్యం చేసిన మహనీయుడు యోగివేమన అని తెలియజేశారు .అలాగే నేడు వేమన పద్యాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఆటవెలది చందస్సు లో పద్యాలు రాసాడని తెలిపారు. పద్య పఠన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ బహుమతులు ప్రధానం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి శేషయ్య గారు ,జంతు శాస్త్రl అధ్యాపకులు జి. ఎల్ .ఎన్ ప్రసాద్ గారు మరియు తెలుగు శాఖ అధ్యక్షులు ఎం. పరమేష్ ,తెలుగు అధ్యాపకులు వై. అంజన రెడ్డి మరియు కంప్యూటర్ అధ్యాపకులు ఎం. సుధాకర్ మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేశారు...


Comments

Popular posts from this blog

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

అష్టావధానము

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు