Posts

గుర్రం జాషువా జయంతి

Image
గుర్రం జాషువా జయంతి కళ్యాణదుర్గంలోని ఎస్ వి జి ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయరాం రెడ్డి గారి అధ్యక్షతన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి జరిగింది.   ప్రిన్సిపల్ గారు సభను ఉద్దేశించి ఉపన్యసిస్తూ తెలుగు సాహిత్య రంగంలో తొలి తరం కవులలో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి గుర్రం జాషువా.వారిది రాపిడి పడ్డ జీవితం, ఆ రాపిడిలో రాణించిన ప్రతిభ  ఆ ప్రతిభలో గుబాలించిన కవిత, కులమత విద్వేషం బుల్ తలచూపుని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది గుర్రం జాషువా అని తెలిపారు.    కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి. శేషయ్య గారు మాట్లాడుతూ గుర్రం జాషువా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యాడని ఈయన కవి కావటానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందాలని తెలిపారు.    తెలుగు విభాగం అధ్యాపకులు ఎం.పరమేష్ ఉపన్యసిస్తూ గుర్రం జాషువా జగమెరిగిన విశ్వ నరుడు.  తెలుగు సాహితీ ప్రపంచంలో మహా దార్శనికుడు తన సాహిత...

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

Image
గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు         SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గము నందు సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ వెంకట అప్పారావు గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Dr. వెంకట శేషయ్య గారు అధ్యక్షత వహించారు.           ఆధునిక తెలుగు సాహిత్యంలో ధ్రువ తారగా ప్రకాశించిన నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు.  ఈయన దేశభక్తుడిగా భావకవిగా, సంఘసంస్కర్తగా,  నాటక కర్తగా, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడులను సృష్టించి తెలుగు జాతిని జాగృతం చేశారు.  అలాగే వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు బాట వేసినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఈయన ముత్యాల సరాలు అనే కొత్త చందస్సులో కొత్త కథా వస్తువులు, సాంఘిక అంశాలు తీసుకొని తెలుగు భాషకు ప్రాముఖ్యమిస్తూ, సహజ వర్ణనలతో రాయబడిన కవితలు అనేకం ఉన్నాయి.  అలాగే దిద్దుబాటు కథానిక లో వైవాహిక జీవిత సమస్యను, మీ పేరేమిటి కథ లో మతం పేరుతో జరిగే మోసాల్ని కళ్ళకు కట్టినట్లు తెలిపారు.  దేశభక్తి కవిత్వం...

అష్టావధానము

Image
తెలుగు విభాగం ఆధ్వర్యంలో అష్టావధానము   కళ్యాణదుర్గంలోని స్థానిక శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14-9-2022 సంవత్సరమున తెలుగు భాషావికాసం మరియు తెలుగువిభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి .జయరామరెడ్డి గారి అధ్యక్షతన అష్టావధాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.   ముందుగా తెలుగు అధ్యాపకులు శ్రీ ఎం పరమేష్ గారు, కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి . జయరామ రెడ్డి గారిని అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాన బాలభాస్కర బిరుదు పొందిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థి చిరంజీవి శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారిని మరియు జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు శ్రీ జి . ఎల్.ఎన్ ప్రసాద్ గారిని అలాగే తెలుగు భాషా వికాసం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.   అష్టావధానములో పాల్గొంటున్న ఎనిమిది మంది పృచ్చకులను కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది.   ఆ తర్వాత ముఖ్య అతిథి, కళాశాల అధ్యక్షులచే...

తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామమూర్తి జయంతి)

Image
   నేడు అనగా 29 ఆగస్టు 2022 న స్థానిక ఎస్విజియం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు తెలుగు విభాగంలో ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన గిడుగు రామమూర్తి జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారు ఉపన్యసిస్తూ పిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషకు చేసిన సేవ అమోఘమని వాడుక భాష తెలుగుకు వేడుక కావాలని మన భాషను రక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉందని అంతేకాకుండా మాతృభాషను ప్రేమించలేనివాడు మాతృదేశాన్ని కూడా ప్రేమించలేడని భాష వలనే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు భావితరాలకు అందుతాయని అలాగే కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మరువకూడదని తెలియజేశారు.     ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు ఎం పరమేష్,   డాక్టర్ వై అంజినరెడ్డి పాల్గొని వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

డిగ్రీ తర్వాత తెలుగులో చేయ దగిన కోర్సులు

 ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా,  మీరు అందరూ డిగ్రీ తృతీయ సంవత్సరం ముగించుకొని ఇప్పుడు ఇప్పుడే పోటీ ప్రపంచంలోకి అడుగు  పెడుతున్నారు.  గతంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం అనగానే మనమందరం ఉన్నత విద్యగా భావించే వాళ్ళము.  కానీ మారుతున్న కాల పరిస్థితులను బట్టి డిగ్రీ తర్వాత పీజీ విద్యను అభ్యసించడం చాలా ముఖ్యము మరియు పిజి విద్యను అభ్యసించడం వలన మీకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించును.  దానితోపాటు పీజీ విద్యను అభ్యసించే సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి ఎక్కువ సమయం ఉండును.  దృష్టిలో ఉంచుకొని మీరు ఎంఏ తెలుగు, టి పి టి తెలుగు వంటి కోర్సులను చేసి తెలుగు భాష ద్వారా కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చ.