అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 21, 2023 న తెలుగు విభాగము ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అధ్యక్షతన, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని విద్యార్థులు ఆలపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి శేషయ్య గారు మాట్లాడుతూ మాతృభాషా అమృతం వంటిదని మనం పుట్టిన నాటి నుండే ఉగ్గుపాలతో పాటు, కన్నతల్లి మాతృభాషాను రంగరించి పోస్తుంది. అందువల్లనే మాతృ భాషను తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు నేర్చుకుంటూనే ఉంటామని తెలిపారు. అంతేకాకుండా వెయ్యి సంవత్సరాలుగా తెలుగు జాతి, వెయ్యి విధాలుగా పండించుకున్న సజీవ భాష తెలుగు భాషని తెలియజేశారు. అలాగే తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించిన ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన ఘనత అమ్మ భాషని తెలిపారు. అలాగే తెలుగు అధ్యాపకులు ఎం. పరమేష్ మాట్లాడుతూ కన్నతల్లి ,పుట్టిన గడ్డ ,స్వర్గం కంటే గొప్పవని వీటితో పాటు మాతృభాషా అయిన తెలుగు మహోన్నతమైనదని తెలుపుతూ, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మా...